This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో రక్తస్రావాన్ని ఎలా ఆపాలి (How to Stop Bleeding During Pregnancy in Telugu)?

Vaginal Bleeding
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణ సమయంలో రక్తస్రావాన్ని ఎలా ఆపాలి (How to Stop Bleeding During Pregnancy in Telugu)?
Likes34 Likes|
Read time7 min

కొన్నిసార్లు గర్భిణీ స్త్రీ యోని నుంచి రక్తస్రావం అవడం గమనించవచ్చు. ఇది సాధారణంగా గర్భిణీ స్త్రీలలో 25% మందికి జరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో రక్తస్రావం అయ్యే మొత్తం మహిళల్లో మూడింట ఒక వంతు నుండి సగం మంది గర్భస్రావానికి గురవుతారు. తరువాతి దశలలో రక్తస్రావం జరగడం తీవ్రమైన ఆందోళనను సూచిస్తుంది. గర్భధారణ సమయంలో రక్తస్రావం జరగడానికి కారణాలు మరియు అది జరిగినప్పుడు నిర్దిష్ట దశలు.

గర్భధారణ సమయంలో ఎంత రక్తస్రావం సాధారణమో మరియు ఎంత జరిగితే అత్యవసర వైద్యం అవసరమో గర్భిణీ స్త్రీ తెలుసుకోవాలి. అదేవిధంగా గర్భధారణ సమయంలో రక్తస్రావాన్ని ఆపడానికి మార్గాలు మరియు చికిత్సలను ఆమె విధిగా తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్ గర్భధారణ సమయంలో రక్తస్రావం యొక్క అత్యంత సాధారణ సందర్భాలను కవర్ చేస్తుంది.

గర్భధారణ సమయంలో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది (Why Does Bleeding Occur During Pregnancy in Telugu)?

గర్భధారణ సమయంలో రక్తస్రావం కావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. గర్భిణీ స్త్రీకి రక్తస్రావం చాలా సాధారణం, ప్రత్యేకించి గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో రక్తస్రావం సంభవించవచ్చు. అయినప్పటికీ గర్భధారణ సమయంలో యోని రక్తస్రావం సంక్లిష్టతలను, లేదా అంతర్లీన పరిస్థితిని సూచిస్తుంది. ఒక మహిళ గర్భవతిగా ఉండి, రక్తస్రావం అవుతున్నట్లయితే, ఆమె వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి. గర్భధారణ సమయంలో రక్తస్రావం జరగడానికి కారణాన్ని నిర్ధారించడానికి మరియు ఆందోళన చెందకుండా ఉండటానికి సాయపడుతుంది. రక్తస్రావాన్ని ఎదుర్కొన్న చాలా మంది గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిస్తారు. గర్భధారణలో రక్తస్రావం యొక్క కారణాలను తెలుసుకోవడానికి ఒక వైద్యుడు లేదా నిపుణుడు అల్ట్రాసౌండ్ పరీక్ష వంటి పరీక్షలను సిఫారసు చేయవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: 8 వారాల ప్రెగ్నెన్సీలో రక్తస్రావం - మీరు వైద్యుడిని సంప్రదించాలా?

మొదటి మూడు నెలల్లో రక్తస్రావం జరగడానికి కారణాలు (Causes of Bleeding During First Three Months of Pregnancy in Telugu)

గర్భిణీ స్త్రీ సాధారణంగా కొన్నిసార్లు రక్తస్రావం అనుభవిస్తుంది. గర్భధారణ యొక్క ప్రారంభ దశల్లో రక్తస్రావం కావడానికి కొన్ని కారణాలు:

గర్భాశయ గోడలో ఫలదీకరణం చెందిన గుడ్డు అమరినట్లయితే, రక్తస్రావానికి దారితీయవచ్చు. ఇది ప్రారంభ గర్భధారణలో ఒక రొటీన్ సంఘటన.

  • మోలార్ ప్రెగ్నెన్సీ

ఫలదీకరణ గుడ్డు గర్భాశయంలో అమరినప్పుడు, పిండానికి బదులుగా కణితి ఏర్పడటానికి దారితీసినట్లయితే అది రక్తస్రావానికి కూడా దారితీయవచ్చు. గర్భధారణ సమయంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదు.

ఇది గర్భాశయం వెలుపల (ఫెలోపియన్ గొట్టాలలో) సంభవిస్తుంది. ఇది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది.

  • సబ్కోరియోనిక్ హెమటోమా

గర్భాశయం లోపల పిండం చుట్టూ ఉన్న పొర రక్తస్రావానికి కారణమవుతుంది. సబ్కోరియోనిక్ హెమటోమాస్ సమయం గడిచిన కొద్దీ నయం అవుతాయి.

  • సర్వైకల్ పాలిప్స్

ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భాశయంపై క్యాన్సర్ కాని గడ్డల పెరుగుదల రావచ్చు. దీని వల్ల గర్భధారణ సమయంలో రక్తస్రావానికి దారితీస్తుంది.

కొన్నిసార్లు, 20 వారాలకు ముందు గర్భం పోవచ్చు. సాధారణంగా లక్షణాలు తేలికపాటి రక్తస్రావంతో ప్రారంభమవుతాయి. క్రమంగా తీవ్రమైన తిమ్మిరి వంటి లక్షణాలతో భారీ రక్తస్రావానికి దారితీస్తాయి. ఇది చివరికి గర్భస్రావానికి దారితీస్తుంది. ఇది తల్లిని, కుటుంబాన్ని మానసికంగా కలవరపెడుతుంది.

రెండో లేదా మూడో త్రైమాసికంలో రక్తస్రావం అవడానికి కారణాలు (Causes of Bleeding in Second and Third Trimester in Telugu)

ఈ సాధారణ కారణాల వల్ల రెండో లేదా మూడో త్రైమాసికంలో రక్తస్రావం జరగవచ్చు:

  • ప్లాసెంటా ప్రీవియా అనేది అరుదైన వైద్య పరిస్థితిని సూచిస్తుంది. ప్లాసెంటా కొంత భాగాన్ని లేదా మొత్తం గర్భాశయాన్ని కవర్ చేసినప్పుడు ఇది జరుగుతుంది. గర్భధారణ కాలం 20 వారాల వ్యవధి దాటిన తరువాత ఇది సంభవించవచ్చు.
  • గర్భాశయం యొక్క గోడ నుండి ప్లాసెంటా సంబంధం తెగిపోయినప్పుడు, ఇది ప్లాసెంటల్ అబ్రప్షన్ అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. పిండం, అలాగే తల్లిపై తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయి.
  • గర్భం ధరించిన 37 వారాలకు ముందు ముందస్తు ప్రసవానికి (ప్రీటర్మ్) దారితీస్తుంది.
  • అసమర్థ గర్భాశయ ముఖద్వారం: గర్భాశయ ముఖద్వారం సమయానికి ముందే వ్యాకోచిస్తుంది. ఇది అకాల ప్రసవానికి కారణమవుతుంది.
  • గర్భస్రావం: 20వ వారం తర్వాత గర్భం కోల్పోవడం.

గర్భధారణ సమయంలో రక్తస్రావం కావడానికి కొన్ని ఇతర కారణాలు ఇవే..

  • సెక్స్: సంభోగం తర్వాత కొంత రక్తస్రావం జరిగిన సందర్భాలు ఉండవచ్చు. గర్భధారణ సమయంలో గర్భాశయం ఎక్కువ సున్నితంగా ఉండటమే దీనికి కారణం
  • కటి పరీక్ష లేదా అల్ట్రాసౌండ్: కొన్నిసార్లు కటి పరీక్ష తర్వాత లేదా గర్భాశయ ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ సమయంలో రక్తస్రావం సంభవించవచ్చు.
  • ఇన్ఫెక్షన్: క్లామిడియా, గనేరియా, సుఖ వ్యాధులు లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి కొన్ని ఇన్ఫెక్షన్లు గర్భధారణ సమయంలో రక్తస్రావానికి ప్రధాన కారణాలు కావచ్చు.

గర్భధారణ సమయంలో ఎంత రక్తస్రావం సాధారణం (How Much Bleeding is Common During Pregnancy in Telugu)?

రక్తస్రావం, దీనిని స్పాటింగ్ అని కూడా పిలుస్తారు. గర్భధారణ సమయంలో పూర్తిగా అసాధారణం కాదు. అయితే రక్తస్రావం లేదా స్పాటింగ్ వెనుక ఉన్న కారణం గురించి స్పష్టంగా తెలియనప్పుడు మనం తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

గర్భధారణ సమయంలో రక్తస్రావాన్ని సహజంగా ఎలా ఆపాలి (How to Stop Bleeding During Pregnancy Naturally in Telugu)?

రక్తస్రావాన్ని వెంటనే ఆపడానికి ఎటువంటి పరిష్కారాలు లేవు. ఇది కొన్ని గంటల్లో సహజంగా ఆగిపోవచ్చు లేదా కొన్నిసార్లు గర్భిణీ స్త్రీ కాలక్రమేణా భారీ రక్తస్రావాన్ని అనుభవించవచ్చు.

గర్భధారణ సమయంలో రక్తస్రావాన్ని ఆపడానికి సులభమైన మార్గాలలో ఒకటి సరైన విశ్రాంతి తీసుకోవడం. అప్పుడు కూడా రక్తస్రావం ఆగిపోకపోతే, కుటుంబ సభ్యులు వెంటనే ఆ మహిళను ఒక నిపుణుడి వద్దకు తీసుకెళ్లాలి. అలాగే రోగనిర్ధారణ తరువాత ఒక వైద్యుడు లేదా నిపుణుడు ఈ విషయాలను సూచించవచ్చు:

  • పని నుండి విరామం తీసుకోవాలి.
  • పాదాలకు పని చెప్పకపోవడం అంటే పూర్తి బెడ్ రెస్ట్
  • సంభోగం చేయకూడదు
  • డౌచ్ (కడగడం) చేయకూడదు
  • టాంపోన్‌లను ఉపయోగించరాదు
  • హెల్దీ లైఫ్ స్టైల్‌ని గడపడం
  • పుష్కలంగా నీరు తాగటం
  • మంచి నిద్ర పొందడం

అధిక రక్తస్రావం జరిగినట్లయితే, మహిళను ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది లేదా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

గర్భధారణ సమయంలో రెండవ త్రైమాసికంలో రక్తస్రావాన్ని ఎలా ఆపాలి (How to Stop Bleeding During Second Trimester in Telugu)?

గర్భం యొక్క రెండవ త్రైమాసికంలో రక్తస్రావాన్ని ఆపడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి:

  • వైద్యపరంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వైద్యులు మెథోట్రెక్సేట్ మాత్రలు ఇవ్వొచ్చు. వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవి వేసుకోవాలి.
  • మెథోట్రెక్సేట్ చికిత్స చేయించుకోవడానికి మహిళ యొక్క పరిస్థితి సరిపోనప్పుడు శస్త్రచికిత్స చేయవచ్చు.
  • డైలేషన్ మరియు క్యూరెట్టేజ్ (D&C) అనేది గర్భాశయంలోని పిండం కణజాలాన్ని తొలగించే ఒక నిర్దిష్ట ప్రక్రియ. ఇది రక్తస్రావం లేదా ఇన్ఫెక్షన్ తో సహా అదనపు సంక్లిష్టతలను నివారిస్తుంది.

సారాంశం (Summary)

గర్భధారణ సమయంలో రక్తస్రావం ప్రమాదకరం. కానీ కొన్నిసార్లు ఇది బిడ్డకు లేదా తల్లికి నిజంగా ముప్పు కాకపోవచ్చు. ఏదేమైనా భాగస్వామి లేదా కుటుంబం దీనికి కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే స్పెషలిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. తల్లి, పిండం ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించుకోవడం కోసం గర్భధారణ సమయంలో రక్తస్రావం కావడానికి కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం.

Tags:

Bleeding during pregnancy in telugu, Bleeding in first trimester in telugu, Does bleeding during pregnancy leads to abortion in telugu, Causes of bleeding during pregnancy, how to stop bleeding during pregnancy in telugu.

Also Read In:

English: How To Stop Bleeding During Pregnancy?

Hindi: How To Stop Bleeding During Pregnancy in Hindi

Bengali: How To Stop Bleeding During Pregnancy in Bengali

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.